ePaper
Monday, September 7, 2026
ePaper
Homeఎడిటోరియల్రైల్వే కోడూరులో రాస్తారోకో

రైల్వే కోడూరులో రాస్తారోకో

📰 Generate e-Paper Clip

–పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల  పెంపుకు నిరసనగా వామ పక్షాలు రైల్వే కోడూరులో రాస్తారోకో

సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు):

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు   పెంపును ఉపసంహరించుకోవాలని,  వామ పక్షాలు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో, మంగళవారం ఉదయం టోల్గేట్ గాంధీ విగ్రహం వద్ద, సిపిఎం, సిపిఐ, సిపిఐ .ఎంఎల్ , ఆధ్వర్యంలో రాస్తారు ఒక నిర్వహించారు. సిపిఎం జిల్లా నాయకులు, సిహెచ్ చంద్రశేఖర్, సిపిఐ జిల్లా నాయకులు, రాధాకృష్ణ మాట్లాడుతూ, కేవలం మే నెలలోనే 11 రోజుల్లో ప్రధాని మోడీ, కార్పొరేట్ల లాభాలు కోసం, నాలుగు సార్లు ధరల పెంచారన్నారు. మొదటిసారి లెటర్ పై మూడు రూపాయలు, 90 పైసలు 91 పైసా 87 పైసలు 86 పైసలు 23 పైసలు, ఇలా ప్రతి సారీ పెంచుకుంటూ  దాదాపు 30రూపాయల వరకు పెంచాలని పారాలు వేస్తున్నారు అన్నారు. దీనితో నిత్యవసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండమన్నారు.  బిజెపి రాకమందు,35 ,45, ఉన్న పెట్రోల్ డీజిల్, 110 దాకా పెరిగిందన్నారు. వంట గ్యాస్ ధరలు, 300 రూపాయలు పైగా పెంచారన్నారు. కమర్షియల్ గ్యాస్ వెయ్యి రూపాయలు దాకా  పెంచారన్నారు. ప్రధాని మోడీ విధానాల వల్ల  ఇంధనం చార్జీలు పెరిగాయి అన్నారు. ఇరాను, రష్యా, తక్కువ ధరకు, అప్పుగాను ఇచ్చేవని,  అక్రమ యుద్దాల వల్ల అమెరికా ట్రంపుకు ప్రధాని మోడీ లొంగిపోవడం ఫలితంగానే ధరల పెరిగాయి అన్నారు.  కృష్ణా గోదావరి కేజీ బేసిన్లో 50%, గ్యాస్ మన వాటా రావాల్సి ఉందని, గుజరాత్. మహారాష్ట్రకు రిలయన్స్ అంబానీ ఆదానే, తరలించకపోయారన్నారు. దీనిపైన కూటమి ప్రభుత్వం  కేంద్రంపై ఎందుకు పోరాటం లేదని ప్రశ్నించారు.. కేంద్ర ప్రభుత్వం, 20 రూపాయలు , రాష్ట్ర ప్రభుత్వం 35 రూపాయలు, టాక్స్లు వేసి ప్రజల నుండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ టాక్స్ లు ఉపసంహరించుకోవాలని,  పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు,  ఈ కార్యక్రమంలో, సిపిఐ, మండల కార్యదర్శి, దార్ల రాజశేఖర్, సిపిఐ ఎంఎల్, సిగి చెన్నయ్య, ఆదాం, సుబ్బయ్య, సిపిఎం నాయకులు, లింగాల యానాదయ్య, పి జాన్ ప్రసాద్, కర్రతోట హరి నారాయణ,  బండారు. రాజశేఖర్, బొజ్జ శివయ్య, కోడూరు సిపిఐ, యానాది,జై చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!