ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టుల దినోత్సవం

ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టుల దినోత్సవం

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్‌ కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ ఆధ్వర్యంలో జాతీయ జర్నలిస్టుల దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌, ప్రొద్దుటూరు ప్రెస్‌క్లబ్‌ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు ఆపిల్‌ పండ్లు పంపిణీ చేశారు.

 

రోగులు, వారి బంధువులను ఆప్యాయంగా పలకరించిన కమిషనర్‌ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌ సభ్యులు తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి సమర్పించిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్‌ శ్రీనివాస విశ్వనాధ్‌ తెలిపారు.

 

కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ సభ్యులు వెంకటేష్‌, శ్రీధర్‌, ధన్య టీవీ రాజు, హెచ్ఎంటీవీ గురు, పోసాని మురళి, అబ్దుల్‌ రజాక్‌, ఈనాడు శ్రీను, రఫిక్‌, పోసా మహేష్‌, పవన్‌, కాంట్రాక్టర్‌  సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!