–సమన్వయకర్తగా అక్కి దాసరి రామారావు నియామకం
సలాం ప్రొద్దుటూరు :
కడప జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జనసేన పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమన్వయకర్తగా ప్రొద్దుటూరు కు చెందిన అక్కి దాసరి రామారావును నియమించింది.ఈ సందర్భంగా అక్కి దాసరి రామారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ చైర్మన్ నాగబాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తనకు అప్పగించిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని రామారావు హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియలో చురుకైన పాత్ర పోషిస్తానని తెలిపారు.తనకు ఈ బాధ్యత అప్పగించిన జనసేన పార్టీ పెద్దలకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు అక్కి దాసరి రామారావు పేర్కొన్నారు.

