ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

–ఉత్తమ సేవలందించిన 8 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం

 

సలాం   ప్రొద్దుటూరు:

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తున్నారని రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు అధ్యక్షుడు కొవ్వూరు రమేష్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 5న రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు ఐ హాస్పిటల్స్‌ సభా భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.రోటరీ ఐ హాస్పిటల్‌, ఇన్నర్‌ వీల్‌ సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వారికి శాలువా, సత్కారం అందించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎర్రగుంట్ల త్రివిక్రమ్‌రెడ్డి, ఇంటర్మీడియట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ను ముఖ్య అతిథిగా, విద్యావేత్తగా సత్కరించారు. అలాగే రాజుపాలెం ఎంఈఓ రామస్వామిరెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం వైవీ విజయభాస్కర్, మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌కు చెందిన కె. రమణారెడ్డి, మున్సిపల్‌ ప్రైమరీ స్కూల్‌ నడింపల్లికి చెందిన వి. సుబ్బయ్య, జడ్పీహెచ్‌ఎస్‌ ఎస్పీసీఎన్‌ఎంపీఎల్‌ హైస్కూల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ బి. చంద్రకళ, ఎంపీపీ ఎస్‌ కల్లూరుకు చెందిన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ డి. లక్ష్మీలావణ్య, మున్సిపల్‌ మోడల్‌ ఉర్దూ పాఠశాల, కొత్తకోటల్లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ హిందీ టీచర్‌ పటాన్‌ కరిష్మాలను సన్మానించారు.ఈ సందర్భంగా రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్‌రెడ్డి మాట్లాడుతూ రోటరీ సంస్థ సమాజ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ, మంచి పౌరులుగా తయారు చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ద్వారా వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.“ఉపాధ్యాయులు సమాజానికి, దేశ అభివృద్ధికి స్తంభాల్లాంటివారు. వారి సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులను ప్రోత్సహించడం రోటరీ సేవా కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన భాగమని తెలిపారు.కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ సెక్రటరీ గండ్లూరు శ్రీధర్‌ శర్మ, ట్రస్ట్‌ అధ్యక్షుడు ఎంవీఎన్‌ ప్రభు, ట్రస్ట్‌ సెక్రటరీ జాకీర్‌ అహ్మద్, రోటరీ ఇన్నర్‌ వీల్‌ సెక్రటరీ పొన్న లక్ష్మీదేవి, పీడీజీ సాధు గోపాలకృష్ణ, ఇమిడియట్‌ పాస్ట్‌ ప్రెసిడెంట్‌ గజ్జల వెంకటేశ్వర్‌రెడ్డి, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ టి. బాలసూర్యరావు, ఎం. సూర్యనారాయణరెడ్డి తదితర రోటరీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!