ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీరామచంద్రస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

శ్రీరామచంద్రస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

📰 Generate e-Paper Clip

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి సహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నంద్యాల ఆనంద్ భార్గవ్ రెడ్డి, లింగాపురం ఏజీఆర్ బ్యాంక్ చైర్మన్ సిద్ధారెడ్డి నాగముని రెడ్డి, మార్కెట్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, పెద్దమనిషి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అలాగే కల్లూరు గ్రామ నాయకులు నిరంజన్ రెడ్డి, నరసింహరావు, వేణుగోపాల్ యాదవ్, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు, పెద్ద మున్నయ్య, గురుశంకర్, గురప్పతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!