ePaper
Monday, September 7, 2026
ePaper
Homeఎడిటోరియల్శభాష్.. ఎస్ ఐ మహమ్మద్ రఫీ..

శభాష్.. ఎస్ ఐ మహమ్మద్ రఫీ..

📰 Generate e-Paper Clip

 

 

– కడప తాలుకా ఎస్ ఐ మహమ్మద్ రఫీ & టీమ్ కు ప్రశంశలు..

– వ్యక్తి ప్రాణాలను కాపాడిన డయల్ 112

కాల్

 

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

అప్పుల బాధతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తిని కేవలం 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని కాపాడిన కడప తాలూకా ఎస్.ఐ మహమ్మద్ రఫీ, బ్లూ కోల్ట్ పోలీసులకు జనం సెల్యూట్ చేస్తున్నారు.

కడప ప్రకాష్ నగర్ పరిధిలో ఓ వ్యక్తి చికెన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అప్పుల బాధ తాళలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ఇంటినుండి బయలుదేరాడు. ఆందోళనకు గురైన ఇంట్లోని కుటుంబ సభ్యులు డయల్ 112 కు సమాచారం ఇవ్వడంతో వెంటనే కమాండ్ కంట్రోల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ హెడ్ కానిస్టేబుల్ మూర్తి, కడప తాలూకా ఎస్.ఐ మహమ్మద్ రఫీతో పాటు బ్లూ కోల్ట్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తాలూకా ఎస్.ఐ మహమ్మద్ రఫీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి లొకేషన్ ను గుర్తించి కడప రైల్వే స్టేషన్ నుండి తిరుపతి వెళ్లే రైలు మార్గంలో పుట్లంపల్లి సమీపంలో ఉన్నట్లు గుర్తించి ట్రాక్ పై ఉన్న బాధిత వ్యక్తిని తక్షణం తప్పించి సురక్షితం చేసారు. ఎస్ ఐ మహమ్మద్ రఫీ, బ్లూ కోల్ట్స్ పోలీసులకు బాధిత వ్యక్తి తరపు కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. Sp, DSP అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!