సలాం ప్రొద్దుటూరు:
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 34వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు ఉట్టి నాగశయనం, 34వ వార్డు ఇన్‌చార్జి జి.వి. సుబ్బమ్మ ఆధ్వర్యంలో 34వ వార్డులోని 125వ బూత్ పరిధిలో ఇంటింటా ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో 34వ వార్డు కూటమి నాయకులు మదర్సాబ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నల్లదిమ్మి కుమారి, బూత్ ఇన్‌చార్జి మరియు KSS సభ్యులు మల్లికార్జున, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

