–పోట్లదుర్తిలో స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న టీడీపీ యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు సి.ఎం. సురేష్ నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడటంతో కాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పోట్లదుర్తి గ్రామంలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను టీడీపీ యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా సురేష్ నాయుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కొండారెడ్డి, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఆయనకు అవసరమైన వైద్య సహాయం, విశ్రాంతి తదితర అంశాలపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి, టీడీపీ యువనాయకుడు బచ్చల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
