–డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అనాథ శరణాలయంలో సేవా కార్యక్రమం
సలాం ప్రొద్దుటూరు:
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులో మెగా జనసేన కార్యకర్తలు సేవా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి ఫౌండేషన్ అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, శరణాలయంలోని విద్యార్థులు, అనాథలకు భోజనం అందించారు.ఈ కార్యక్రమం రామోజీ ప్రసాద్, రామారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం జనసేన కార్యకర్తల సామాజిక బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.అన్నదాన కార్యక్రమంలో తాలమాపురం శివపత్తి శివకళ్యాణ్, మంచాల సంజీవ్, మధు చిరు రాయల్, శివ అశోక్, కేశవ, సుబ్బరాయుడు, రాము తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
