ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeఎడిటోరియల్పేదలకు విద్యను దూరం చేస్తున్న కార్పోరేట్ ప్రవేట్ పాఠశాలలు       

పేదలకు విద్యను దూరం చేస్తున్న కార్పోరేట్ ప్రవేట్ పాఠశాలలు       

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు  (కర్నూల్):

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పి ఎస్ యు జిల్లా అధ్యక్షులు అయ్యన్న, ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వేటూరి రంగస్వామి ,ఎంవీఎస్ జిల్లా అధ్యక్షులు స్వామి దాసు నాగేంద్ర పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సీనియర్ వన్ ఎం అసదుల్లా ఖాన్ కు వినతి పత్రం ఇచ్చారు.అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు .అలాగే పాఠశాలలే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్ములు మరియు ఇతర విద్యా సామగ్రిని అధిక ధరలకు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను పై వత్తిడి తెస్తున్నారని వారు అన్నారు. కొన్ని విద్యాసంస్థలు శాశ్వత భవనాలకు బదులుగా రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తూ, సరైన తరగతి గదులు, ఆట స్థలం, తాగునీరు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ వంటి కనీస మౌలిక వసతులు లేకుండానే పాఠశాలలను నడుపుతున్నారని వారు అన్నారు .విద్యార్థుల భద్రత, ఆరోగ్యం విద్యా ప్రమాణాలు దెబ్బ తింటున్నయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.అందువల్ల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అధికంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, సరైన మౌలిక వసతులు కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు అయ్య స్వామి, అజయ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!