సలాం ప్రొద్దుటూరు (వై ఎస్ ఆర్ కడప):
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నవీకరణపై చేపట్టిన సర్వే సమర్ధంగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ తెలిపారు.మంగళవారం ఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానం లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ….ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేసేందుకు జరుగుతున్న ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియ ను పూర్తి చేయాలని ఆదేశించారు.బి ఎల్ ఓ లు క్షేత్ర స్థాయిలో ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలన్నారు.ఈ సర్వే ప్రక్రియ నాణ్యత తో పారదర్శకంగా చేయాలని తెలిపారు.ఓటర్ల మ్యాపింగ్ లో ఎక్కడా తప్పులు లేకుండా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలనిపలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా ప్రత్యేక అధికారి గా నియమితులైన ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ సెక్రటరీ టి.ఎస్. చేతన్,జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు …జిల్లాలో 2252 బిఎల్ఓ లు ఉన్నారని,జిల్లా లో మొత్తం 1896231 ఓటర్లు కలరని, 97.67శాతం ఫారం పంపిణీ ప్రక్రియ జరిగిందని, 21.53శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డి ఆర్ ఓ మల్లికార్జునుడు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
