సలాం ప్రొద్దుటూరు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేక్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ , రాష్ట్ర రహదారులు & భవనాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారితో కలిసి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా గవర్నర్ వారిని ఆత్మీయంగా పలకరించి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సమకాలీన అంశాలు మరియు ప్రజలకు మెరుగైన సేవల అందింపుపై స్నేహపూర్వకంగా చర్చించారు. అనంతరం గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన డా. ముక్తియార్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మర్యాదపూర్వక భేటీ ఆప్యాయ వాతావరణంలో సాగగా, పలువురు నాయకులు, అధికారులు కూడా పాల్గొన్నారు.
