ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeఆరోగ్యంతాళ్లమాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

తాళ్లమాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు రోటరి కంటి ఆసుపత్రి ,కడప జిల్లా అంధత్వ నివారణ సొసైటి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తాళ్లమాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య పరీక్షా శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

 

తాళ్లమాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్యులు వందలాది మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు మందులు పంపిణీ చేశారు.

పరీక్షల్లో శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన అర్హులైన రోగులకు రోటరి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆపరేషన్‌కు సంబంధించిన రవాణా, భోజనం, వసతి, మందులు, కంటి అద్దాలు తదితర సౌకర్యాలను కూడా పూర్తిగా ఉచితంగా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోటరి ట్రస్ట్ ప్రతినిధులు కోరారు. శిబిరం విజయవంతం కావడానికి వైద్య బృందం, స్థానిక నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు విశేషంగా కృషి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!