ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్సిపిఎం ఆధ్వర్యంలో టిబి రోడ్డు లో పెట్రోలు డీజీలు గ్యాస్ నిత్యవసర వస్తువులధరలు...

సిపిఎం ఆధ్వర్యంలో టిబి రోడ్డు లో పెట్రోలు డీజీలు గ్యాస్ నిత్యవసర వస్తువులధరలు తగ్గించాలని రాస్తారోకో

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు :

స్థానిక టిబి రోడ్డులో శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యవసర ధరలు పెంపుకు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా

సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారం కొనసాగిస్తూ ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ పై ఒక్క లీటర్ పై పది రూపాయలు పైన పెంచి ప్రజల నడ్డి విరిచారు అన్నారు.ఈ పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వలన నిత్యవసర వస్తువులన్నీ పెరిగిపోయి ప్రజలకు భారం అవుతాయన్నారు. పెంచిన ధరలు వెంటనే అదుపు చేయాలని డిమాండ్ చేశారు. 9 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నామని ప్రజలు ఈ భారాలను మోయలేకున్నారని అన్నారు .చైన్ లింకు మాదిరిగా అన్ని పెరుగుతాయని అన్నారు .ఈ రాస్తారోకోలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పకీరయ్య ,విజయకుమార్ , పొద్దుటూరు పట్టణ కార్యదర్శి జి ప్రేమ అధ్యక్షులు ,విజయ కుమారి, డివైఎఫ్ఐ కార్యదర్శి విశ్వనాథ్ ,ఆటో యూనియన్ కార్యదర్శి గోపాల్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డేవిడ్ శేఖర్ ,సిపిఎం నాయకులు చెన్నారెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!