సలాం ప్రొద్దుటూరు – అమరావతి:
మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు తేదీని సవరించింది. ముందుగా ఈ నెల 25న ప్రకటించిన సెలవును 26వ తేదీకి మార్చింది.చంద్ర దర్శనం ఆధారంగా ఈ ఏడాది మిలాద్-ఉన్-నబీ పండుగ ఆగస్టు 26న నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సెలవు తేదీలో మార్పు చేస్తూ నిర్ణయం వెలువరించింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తదితరాలకు వర్తించే సెలవు ఆగస్టు 26కు మారనుంది.
