సలాం ప్రొద్దుటూరు – రాజంపేట:
రాజంపేట పట్టణంలోని సుద్ధగుంతల ప్రాంతంలో దారుణ హత్య చోటుచేసుకుంది. చిలకాల పెంచలయ్య (64) అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన సాదు శెట్టి నరసింహ (58) కత్తితో పొడిచి పరారైనట్లు సమాచారం.కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడిన పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు, నిందితుడు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారిగా, పాల వ్యాపారం నిర్వహిస్తున్నవారిగా సమాచారం.ఘటనకు దారితీసిన కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న రాజంపేట పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
