ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్మెగా అభిమానుల ఆధ్వర్యంలో మొక్కలు నాటిన కార్యక్రమం

మెగా అభిమానుల ఆధ్వర్యంలో మొక్కలు నాటిన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకుని మెగా అభిమానుల ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం వద్ద ఉదయం 11.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఫౌండర్ సుబ్బరాయుడు పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ.. చిరంజీవి జన్మదిన వారోత్సవాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అభిమానులు సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. చిరంజీవికి ఇంతటి అభిమానులు ఉండటం ఆయన అదృష్టమని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.జనసేన పార్టీ నాయకుడు, బొల్లారం వెంకటేశ్వరస్వామి ఆలయ బోర్డు సభ్యుడు రామోజీ ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి జన్మదినాన్ని ‘సేవా తత్పరత దినోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. సినీ ప్రపంచంలో అభిమానుల చేత అత్యంత ఘనంగా గౌరవించబడుతున్న నటుల్లో చిరంజీవి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు, షరీఫ్ టైర్స్, సాగర్, బియ్యం కేశవ, రాము, నాయబ్, నంద మెగా శ్యామ్, బాబురావు, మధు, చెన్న రవి తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!