ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

 

 

సలాం   ప్రొద్దుటూరు:

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ, సీఐటీయూ కార్యదర్శి బి. విజయకుమార్ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ సిద్ధించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం దేశ ఐక్యత, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ జాతీయ జెండాకు గౌరవం చాటుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి కె. సాల్మన్, పి. రాఘవేంద్ర, రవి, మోహన్, అన్నపూర్ణ, ప్రమీలమ్మ, శాంతి, నీతమ్మ, రమాదేవి, ఐద్వా కార్యదర్శి జి. ప్రేమ, అధ్యక్షురాలు వై. విజయమ్మ, ఉపాధ్యక్షులు వెంకటసుబ్బమ్మ, లక్ష్మీదేవి, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి బి. విశ్వనాథ్, అధ్యక్షుడు మేరీ బాబు, పర్మినెంట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు మధు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు డి. ఓబులేసు, ఎలక్ట్రిసిటీ యూనియన్ కార్యదర్శి పి. బాలసుబ్బయ్య, కోవిడ్ కార్మికుల నాయకులు కార్తీక్, చిన్న ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!