మెగా అభిమానుల ఆధ్వర్యంలో మొక్కలు నాటిన కార్యక్రమం
సలాం ప్రొద్దుటూరు: పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకుని మెగా అభిమానుల ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం వద్ద ఉదయం 11.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఫౌండర్ సుబ్బరాయుడు పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ.. చిరంజీవి జన్మదిన వారోత్సవాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అభిమానులు సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. చిరంజీవికి ఇంతటి అభిమానులు ఉండటం ఆయన అదృష్టమని, ఆయన నిండు...