–జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించి, తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.తదుపరి గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ ముక్తియార్, కూటమి ప్రభుత్వ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, నందమూరి అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

