ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది –చల్లా 

స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది –చల్లా 

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని రామేశ్వరంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.స్వాతంత్ర్యం సాధించడంతో మన బాధ్యత పూర్తికాలేదని, దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తూ భారతదేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.రాబోయే తరాలకు కూడా స్వేచ్ఛాయుతమైన, సమానత్వంతో కూడిన భారతదేశాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని చల్లా రాజగోపాల్ యాదవ్ ఆకాంక్షించారు.

బేపారి ఆరిఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వీట్స్, జాతీయ జెండాల పంపిణీ

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బేపారి ఆరిఫ్ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్ బాక్సులు, జాతీయ జెండాలను పంపిణీ చేశారు. పాఠశాల గోడ నిర్మాణానికి తమవంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు భవిష్యత్‌లోనూ పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారు కలలుగన్న సుసంపన్నమైన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్, లాయర్ జిలాన్,పాఠశాల హెచ్ ఎం, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!