టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
–జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించి, తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకున్నారు....