ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంప్రవక్త ﷺ బోధనలు మానవాళికి మార్గదర్శకం

ప్రవక్త ﷺ బోధనలు మానవాళికి మార్గదర్శకం

📰 Generate e-Paper Clip

 

–ముస్లిం సోదర, సోదరీమణులకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

 

సలాం ప్రొద్దుటూరు – పులివెందుల:

పవిత్ర మిలాద్ ఉన్ నబీ ﷺ సందర్భంగా కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

 

మహమ్మద్ ప్రవక్త ﷺ మానవాళికి అందించిన ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం, శాంతి వంటి గొప్ప సందేశాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రవక్త ﷺ బోధించిన మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

 

మిలాద్ ఉన్ నబీ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సుఖసంతోషాలు నింపాలని, సమాజంలో మతసామరస్యం మరింత బలపడాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆకాంక్షించారు.

 

“ప్రవక్త ﷺ చూపిన ప్రేమ, శాంతి, మానవతా మార్గంలో సమాజం పయనించాలి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ పవిత్ర పర్వదినం వెలుగులు నింపాలి” అని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!