ePaper
Monday, October 19, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంశాంతి, సోదరభావానికి ప్రవక్త మహమ్మద్ ﷺ బోధనలు మార్గదర్శకం–ఎమ్మెల్యే వరద

శాంతి, సోదరభావానికి ప్రవక్త మహమ్మద్ ﷺ బోధనలు మార్గదర్శకం–ఎమ్మెల్యే వరద

📰 Generate e-Paper Clip

 

 

–ముస్లిం సోదరసోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

 

సలాం   ప్రొద్దుటూరు:

సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి, సోదరభావం కోసం కృషి చేసిన మహానీయుడు మహమ్మద్ ప్రవక్త ﷺ అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరసోదరీమణులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సాటివారి పట్ల ప్రేమ, దయ, కరుణతో మెలుగుతూ శాంతియుత సమాజ నిర్మాణానికి మహమ్మద్ ప్రవక్త ﷺ తన జీవితాన్ని అంకితం చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన దివ్యబోధనలు, కరుణ, సోదరభావం, త్యాగం, సహనం వంటి మహోన్నత విలువలు ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.ఈ పవిత్రమైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరిపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యం, సమృద్ధి వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!