–కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి–డా. వి.ఎస్. ముక్తియార్
సలాం ప్రొద్దుటూరు:
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో “స్వచ్ఛ–ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు” కార్యక్రమంలో భాగంగా సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ పాల్గొని స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయినప్పటికీ, కాలుష్యం రూపంలో మనమే మన స్వాతంత్ర్యాన్ని కలుషితం చేసుకుంటున్నామని అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించిన స్ఫూర్తితోనే నేడు కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించాలని సూచించారు. ఆహార వ్యర్థాలు, చెత్తను మురుగు కాలువల్లో వేయకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లోనే వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన ప్రొద్దుటూరును నిర్మించగలమని డా. ముక్తియార్ పేర్కొన్నారు. నేడు మనం పాటించే చిన్నచిన్న జాగ్రత్తలు భవిష్యత్ తరాల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.“స్వచ్ఛ–ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు” సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి, పరిశుభ్రమైన ప్రొద్దుటూరు నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
