ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఆరోగ్యంఆహార నియమాలతో గుండె జబ్బులు నివారణ

ఆహార నియమాలతో గుండె జబ్బులు నివారణ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

ఆహార నియమాలు పాటిస్తూ, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చని కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పాతకోట శ్రీనాథరెడ్డి తెలిపారు. నెహ్రూ రోడ్డులోని లక్ష్య హాస్పిటల్‌లో ఆదివారం ఉచిత గుండె, కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీనాథరెడ్డి, డాక్టర్‌ హరిత మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం ప్రతి నెల మూడో ఆదివారం ఉచిత గుండె, కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 63 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పేదలు మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీనాథరెడ్డి కోరారు.

 

ఆదివారం నిర్వహించిన శిబిరంలో 46 మంది గుండె సంబంధిత రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 27 మందికి ఈసీజీ, 11 మందికి గుండె స్కానింగ్‌ ఉచితంగా చేశారు. అలాగే డాక్టర్‌ హరిత 41 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన చికిత్స, వైద్య సూచనలు అందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!