ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఆరోగ్యంఆపదలో ఉన్న మహిళకు అండగా ధార్మిక్ రక్తదాన సేవా సమితి

ఆపదలో ఉన్న మహిళకు అండగా ధార్మిక్ రక్తదాన సేవా సమితి

📰 Generate e-Paper Clip

– తక్షణమే బి పాజిటివ్ రక్తదానం

 

సలాం ప్రొద్దుటూరు:

కడప జిల్లా ప్రొద్దుటూరులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఓ మహిళకు అత్యవసరంగా రక్తం అవసరమవడంతో ఆమె కుటుంబ సభ్యులు ధార్మిక్ రక్తదాన సేవా సమితిని ఆశ్రయించారు. సమాచారం అందుకున్న వెంటనే సమితి చైర్మన్, క్వాలిఫైడ్ జర్నలిజం మాసపత్రిక ఎడిటర్ & పబ్లిషర్ గంజి సురేష్ కుమార్ స్పందించి, స్థానిక సురక్ష బ్లడ్ బ్యాంక్‌లో బి పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు.

 

సకాలంలో స్పందించి రక్తదానం చేయడంతో మహిళ ఆరోగ్యానికి అవసరమైన సహాయం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గంజి సురేష్ కుమార్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారు ధార్మిక్ రక్తదాన సేవా సమితిని సంప్రదిస్తే, తక్షణమే రక్తదాతలను సమన్వయం చేసి అవసరమైన రక్తాన్ని అందించేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

 

రక్తదానం చేసిన ధార్మిక్ రక్తదాన సేవా సమితి సభ్యులకు మహిళ, ఆమె కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని సమితి ప్రతినిధులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!