ePaper
Monday, July 27, 2026
ePaper
Homeరాజకీయంపెన్నానగర్‌లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం విజయవంతం

పెన్నానగర్‌లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం విజయవంతం

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు :

 

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే “ఇంటింటికీ టీడీపీ” కార్యక్రమం పెన్నానగర్‌లో నిర్వహించారు.

 

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి , టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల వివరాలను మై టీడీపీ యాప్‌లో నమోదు చేశారు.

 

ఈ కార్యక్రమంలో యూనిట్ కన్వీనర్ షేక్ షామీర్, కో-కన్వీనర్ షేక్ షరీఫ్ (కవి), 14వ వార్డు ఇన్‌చార్జి సుధాకర్, గగ్గూటూరు ఖాసీం, బాల పెద్దయ్య, కొడిదల ఇమాం హుసేన్, షేక్ గౌసు, సన్న, సుబ్బయ్యతో పాటు టీడీపీ వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా నాయకులు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొంటూ, ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!