–ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి భద్రతపై అధికారులతో కమిషనర్ చర్చ
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరు మెరుగుదలతో పాటు రహదారి భద్రతకు సంబంధించిన అంశాలపై సోమవారం పురపాలక సంఘం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్గొని పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, సిగ్నల్స్ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను సమన్వయంతో అమలు చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.
