ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeరాజకీయంఇంటింటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమం – భగత్ సింగ్ కాలనీలో ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

ఇంటింటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమం – భగత్ సింగ్ కాలనీలో ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

📰 Generate e-Paper Clip

 

సలాం  ప్రొద్దుటూరు:

 

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, రాష్ట్రాభివృద్ధి కోసం చేపడుతున్న పనులను ప్రజలకు వివరించే ఉద్దేశంతో స్థానిక భగత్ సింగ్ కాలనీలో సోమవారం ఇంటింటికీ ప్రచార కార్యక్రమం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు ఆయన వివరించారు.

 

ఇంటింటికీ వెళ్లిన నాయకులు ప్రజలతో మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంత మేరకు చేరుతున్నాయనే విషయంపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా పలువురు మహిళలు, వృద్ధులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రజలకు అందుతున్న సేవలపై తమ ఆనందాన్ని వెల్లడించారు. ప్రజల ఆదరణ, అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని కోరిన నాయకులు, రానున్న ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

 

ఈ కార్యక్రమంలో  ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్, ప్రొద్దుటూరు అబ్జర్వర్ భావన, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!