ePaper
Monday, July 27, 2026
ePaper
Homeరాజకీయంకూటమి పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమం చేరింది: టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్....

కూటమి పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమం చేరింది: టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీబుల్లా

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని టిడిపి పాలన లో ప్రతి ఇంటికి సంక్షేమం చేరిందని టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీబుల్లా  హర్షం వ్యక్తం చేశారు.

సోమవారం ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన “ఇంటింటికీ టీడీపీ” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సారథ్యంలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారని జబీబుల్లా పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ చర్యలను ప్రతి ఇంటికి తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!