ePaper
Sunday, July 26, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యతోనే సమాజంలో సమానత్వం, గౌరవం సాధ్యం–అబ్దుల్ అజీజ్ 

విద్యతోనే సమాజంలో సమానత్వం, గౌరవం సాధ్యం–అబ్దుల్ అజీజ్ 

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (నెల్లూరు):

 

కేవలం విద్యతోనే సమాజంలో సమానత్వం, గౌరవం సాధ్యం అని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు .నెల్లూరు వక్ఫ్ భూమిలో రూ.20 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మిస్తున్న ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్’ పనులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పరిశీలించారు. నెల్లూరు పరమేశ్వరి నగర్ నందు గల వక్ఫ్ భూమి నందు నిర్మిస్తున్న, “డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్” నిర్మాణ పనులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు, వక్ఫ్ సీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. రూ. 20 కోట్లు సిఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ స్థాయి స్కూల్ ను నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాదికి అందుబాటులోకి తేవాలని శరవేగంగా, పనులు జరుగుతున్నాయని తెలిపారు. తనకు అన్ని జిల్లాల నుంచి స్థలాలు కేటాయించాలని ఫోన్లు చేస్తున్నారని స్థలాలు కేటాయిస్తే తాము కూడా స్కూళ్లు నిర్మిస్తామని ముందుకు వస్తున్నారు అని అన్నారు. తలిమే ఏ హునర్ తో 250 మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని, కేవలం చదువుతూనే సమానత్వం గౌరవం దొరుకుతాయని ఆయన అన్నారు. వక్ఫ్ భూములు నిరుపయోగంగా ఉంటే ఆక్రమణకు గురవుతున్నాయని, ఆస్తులను నిరుపయోగంగా ఉంచకుండా ఉపయోగంలోకి తీసుకుని వచ్చి ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. స్కూల్ నిర్మాణానికి సహకరించిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలిపారు. “ఏఎస్ పేట దర్గా విషయం పై స్పందిస్తూ…” ఎస్ పేట సజ్జాద హఫీజ్ పాషా బోర్డుకు వ్యతిరేకంగా 32 కేసులు వేశారని అన్నారు. సజ్జాద పనులు సరిగ్గా చేయడం లేదని అతనికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. గతంలోనే అతనిని మతవల్లిగా తొలగించామని తెలిపారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యులు అక్రమ్, ఖాజా, ఇస్మాయిల్ బేగ్, బెపారి జాకీర్ అహ్మద్ సీఈవో యాకూబ్ ఖాజీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!