ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్నానాజీ వ్యాఖ్యలపై రాచమల్లు ఆగ్రహం

నానాజీ వ్యాఖ్యలపై రాచమల్లు ఆగ్రహం

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

 

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం స్థానిక ఆయన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నానాజీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై దురుసుగా మాట్లాడటం సరికాదని చెబుతూనే, మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదిస్తూ అసభ్యంగా మాట్లాడటం తగదని విమర్శించారు. నానాజీ తన నియోజకవర్గంలో జగన్‌పై పోటీ చేస్తానని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనపై సాధారణ అభ్యర్థి పోటీ చేసినా ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఢిల్లీ స్థాయి రాజకీయాలు చేసి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన నాయకుడని గుర్తు చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగిస్తే రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని హెచ్చరించారు. మరోసారి అసభ్య వ్యాఖ్యలు చేస్తే తగిన సమాధానం ఇస్తామని రాచమల్లు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!