సలాం ప్రొద్దుటూరు:
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని, అలాగే ఉద్యోగ భద్రతను,హెల్త్ బెనిఫిట్స్ కలగజేయాలని మంగళవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత పది, పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను అయినా కూడా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు అలాగే ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ కూడా లేవనీ ఆవేదం వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో జీవితాన్ని గడుపుతున్నామంటూ అంటూ ఉద్యోగులు ఎమ్మెల్యే ఎదుట వినతిపత్రం ఇచ్చారు. దీని ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ విషయాన్ని హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ లోని ఔట్సోర్సింగ్ MNO, FNOలుపాల్గొనడం జరిగింది.
