నానాజీ వ్యాఖ్యలపై రాచమల్లు ఆగ్రహం
సలాం ప్రొద్దుటూరు: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం స్థానిక ఆయన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నానాజీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై దురుసుగా మాట్లాడటం సరికాదని చెబుతూనే, మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదిస్తూ అసభ్యంగా మాట్లాడటం తగదని విమర్శించారు....