సలాం ప్రొద్దుటూరు:
ప్రజా పరిపాలనకు రెండేళ్లు పూర్తి అయ్యిందని, రాష్ట్రం లో అభివృద్ధి,సంక్షేమం కూటమిపాలన లో జరిగిందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు.మంగళ వారం ప్రొద్దుటూరు లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కూటమిపాలన ఏర్పడి రెండేళ్లు పూర్తి సందర్భంగా టిడిపి నాయకులు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమ కూటమి పాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, మహిళలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ల తో కార్యక్రమం విజయ వంతంగా జరిగింది . “2 ఏళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం” కూటమి పాలన విజయోత్సవ ర్యాలీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి శివాలయం సెంటర్ నందు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి ఎస్ ముక్తియార్ , టిడిపి ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిశీలకులు , రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొండవీటి భావన ,రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు ,రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్ ,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి ,రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ పేట చంద్రశేఖర్ ,మాజీ జడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వర రెడ్డి ,జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి , కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్ జబివుల్లా , కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు , కడప పార్లమెంట్ కార్యదర్శి తలారి పుల్లయ్య ,ఇవి సుధాకర్ రెడ్డి , పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గ,రాజుపాలెం మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి ,బచ్చల ప్రతాప్,యూనిట్,బూత్ ఇంచార్జీలు,కూటమి ప్రభుత్వ నాయకులు,కార్యకర్తలు,నందమూరి అభిమానులు,మహిళలు,ప్రజలు భారీగా పాల్గొన్నారు.
