ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విద్యా హక్కు చట్టం (RTE) కింద ఉచిత అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు...

విద్యా హక్కు చట్టం (RTE) కింద ఉచిత అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు ఒక కొండంత అండ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన వరుస తీర్పులు, ఆదేశాలు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం (RTE) కింద ఉచిత అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు ఒక కొండంత అండ.

 

మీ పిల్లల చదువు విషయంలో స్కూలు యాజమాన్యాలు ఏ రకమైన ఇబ్బందులు పెట్టినా, చట్టం మరియు న్యాయస్థానం మీ వైపే ఉన్నాయనే విషయం మరచి పోవద్దు..

 

ఈ క్రింది కోర్టు తీర్పులు.ముఖ్యమైన కేసు నెంబర్లతో సహా పూర్తి వివరాలు..

 

1. 25% ఉచిత సీట్ల కేటాయింపు – మీ పిల్లల చట్టబద్ధమైన హక్కు

 

చాలా ప్రైవేట్ స్కూళ్లు సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది.

 

-యోగానంద్ తాండవ కేసు (Yogesh Thandava PIL – 2017 & 2023 కంటెంప్ట్ పిటిషన్):

 

ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూళ్లలో 25% సీట్లను పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు (EWS/DG) కేటాయించడం చట్టపరమైన బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, 2023 లో దాఖలైన కోర్టు ధిక్కరణ (Contempt) పిటిషన్ ద్వారా నిబంధనలు అమలు చేయని ప్రభుత్వ అధికారులు, స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పదేపదే ఆదేశించింది.

 

-SSK ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కేసు (W.P. No. 27166/2022 – తీర్పు: 24 జూన్ 2024):

ఈ కేసులో హైకోర్టు RTE సెక్షన్ 12(1)(c) అమలును సమర్థిస్తూ, అర్హులైన పిల్లలందరికీ ఖచ్చితంగా అడ్మిషన్లు కల్పించాలని ప్రైవేట్ స్కూళ్లను ఆదేశించింది.

 

-ఇటీవలి చర్యలు (2025 – మార్చి 2026):

కర్నూలు జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ RTE అడ్మిషన్ నిరాకరించడంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, సదరు స్కూల్‌కు గట్టిగా నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.

-అలాగే 2025లో సుమారు 7,500 కంటే ఎక్కువ RTE సీట్లలో అడ్మిషన్లు నిరాకరించిన స్కూళ్లకు కోర్టు షో-కాజ్ నోటీసులు జారీ చేసి చట్టం ముందు నిలబెట్టింది.

 

2. “ఉచిత విద్య” అంటే కేవలం ఫీజు మాత్రమే కాదు!

చాలా ప్రైవేట్ స్కూళ్లు ఫీజు తీసుకోకపోయినా.. బుక్స్, యూనిఫాం, డ్రెస్సుల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తుంటాయి. దీనిపై హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

 

రమాభొట్ల శ్రీనివాస సుధీష్ & ఇతరుల కేసులు (W.P. (PIL) Nos. 183 & 185 of 2019 – తీర్పు: 15 ఏప్రిల్ 2020):

 

ఈ కేసులో హైకోర్టు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది. విద్యా హక్కు చట్టం కింద సీటు పొందిన బిడ్డకు చదువు పూర్తిగా ఉచితం. అంటే స్కూల్ ఫీజుతో పాటు టెక్స్ట్‌బుక్స్ (పుస్తకాలు), యూనిఫాం, ఇతర వస్తువులు కూడా ఉచితంగానే అందాలి (Free Entitlements). వీటి కోసం తల్లిదండ్రులపై ఒక్క రూపాయి కూడా అదనపు ఆర్థిక భారం వేయడానికి వీల్లేదు.

 

3. సిలబస్, టెక్స్ట్‌బుక్స్ పై ప్రైవేట్ స్కూళ్ల ఆటలు సాగవు…

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్కూళ్లు సొంత నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు కట్టడి చేసింది.

 

యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫెడరేషన్ కేసు (W.P. Nos. 11306/2022, 7509/2022 – 2022 నుండి 2024 వరకు జరిగిన విచారణలు):

ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉండాలని, సిలబస్ మరియు పాఠ్యపుస్తకాల సరఫరా విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఈ కేసుల ద్వారా హైకోర్టు స్పష్టం చేసింది.

 

– తల్లిదండ్రులారా – మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

 

– ఏ పాఠశాలలో మన పిల్లల పట్ల వివక్ష చూపకూడదు: RTE కింద చేరిన పిల్లలను, ఫీజు కట్టి చేరిన పిల్లలను స్కూల్లో వేరుగా చూడటం లేదా తక్కువ చేసి మాట్లాడటం చట్టరీత్యా నేరం.

 

-కోర్టు ధిక్కరణ (Contempt) అస్త్రం: కోర్టు ఆదేశాలను స్కూళ్లు లేదా అధికారులు బేఖాతరు చేస్తే, హైకోర్టు వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. అందుకే ఇప్పుడు అధికారులు కూడా భయపడుతున్నారు.

 

తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి:

 

-మీ పిల్లలకి RTE కింద సీటు వచ్చినా స్కూలు వారు అడ్మిషన్ ఇవ్వకపోతే, లేదా చేర్చుకున్నాక పుస్తకాలు, యూనిఫాంల పేరుతో డబ్బులు అడిగి వేధించినా అస్సలు భయపడకండి.

-ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత పదేళ్లుగా (2017 నుండి 2026 వరకు) 10కి పైగా ప్రధాన కేసుల్లో పేద విద్యార్థుల పక్షానే నిలబడి స్పష్టమైన తీర్పులు ఇచ్చింది.

 

స్కూలు యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తే పైన పేర్కొన్న కేసు నెంబర్లను ప్రస్తావిస్తూ వెంటనే మీ పరిధిలోని జిల్లా కలెక్టర్ కు ,విద్యాశాఖ అధికారులకు (MEO/DEO) లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి.

 

చట్టం మీ వైపు ఉంది, కోర్టు రక్షణ మీ పిల్లల భవిష్యత్తుకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ధైర్యంగా మీ పిల్లలను చదివించండి!

 

-నీ బాధ్యత నీ బిడ్డల విద్యా హక్కు ను- చట్టం ను కాపాడుకోవడం..

-చట్టం అమలు చేయాలని పాఠశాల అధికారులను దైర్యం గా ప్రశ్నించండి..

మీకు తోడుగా ప్రభుత్వం.. కోర్టు లు (PAAP-) ఆంధ్రప్రదేశ్ తలిదండ్రుల సంఘం ఉంది..

ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ (PAAP)

(రిజి. నం. 6/2022) ఆంధ్రప్రదేశ్ కమిటీ…..&..X.smc. చైర్మన్ మున్సిపల్ హై స్కూల్.&. ఉత్తరాంధ్ర ఇంచార్జ్. విజయనగరం జిల్లా అధ్యక్షులు& ప్రధాన కార్యదర్శి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!