ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కడప ఉక్కు పరిశ్రమ – కొప్పర్తి పారిశ్రామిక వాడపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక సహించం

కడప ఉక్కు పరిశ్రమ – కొప్పర్తి పారిశ్రామిక వాడపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక సహించం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (కడప):

కడప జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన కడప ఉక్కు పరిశ్రమ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం, కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధి నత్తనడకన సాగడం ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి నిదర్శనం అని  వాటి అభివృద్ధికి ప్రభుత్వం   కృషి చేయాలని AIBSU రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్ డిమాండ్ చేశారు. శనివారం కడప లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించడం ప్రజలను మోసం చేయడమే అన్నారు.కడప జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ఇకపై ప్రజలు సహించరు అన్నారు.కడప ఉక్కు పరిశ్రమను వెంటనే పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలి అన్నారు.కొప్పర్తి పారిశ్రామిక వాడను పేరుకు మాత్రమే పరిమితం చేయకుండా పరిశ్రమలు స్థాపించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలి అన్నారు.యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉపాధి కోసం వేలాది మంది యువకులు జిల్లాను విడిచి వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి, గడువులతో కూడిన అమలు షెడ్యూల్‌ను ప్రజల ముందుంచాలి అన్నారు.లేనిపక్షంలో కడప జిల్లా ప్రజలు, యువత, ప్రజాసంఘాలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా భారీ స్థాయి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్యు నగర నాయకులు ఆనంద్ రెడ్డి, దేవానంద్,ఈశ్వరయ్య,మల్లికార్జున, అవినాష్ గిరీష్,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!