ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్విజయవాడలో విజయవంతంగా "తాలీమ్-ఎ-హునర్"

విజయవాడలో విజయవంతంగా “తాలీమ్-ఎ-హునర్”

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (విజయవాడ):

 

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పిలుపు మేరకు, మైనారిటీల విద్యా, ఉపాధి రంగాభివృద్ధి ధ్యేయంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన ప్రతిష్టాత్మక “తాలీమ్-ఎ-హునర్” కార్యక్రమంలో ఎన్.ఎమ్.డి ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఎం.ఎ.షరీఫ్ ప్రభుత్వ సలహాదారులు, కేశినేని శివనాథ్ (నాని) గారు విజయవాడ ఎంపీ, పెనుగొండ దర్గా పీఠాధిపతి తాజ్ బాబా , ఎమ్మెల్యే నసీర్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావ్ , మౌలానా ముస్తాక్ అహ్మద్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఫారూఖ్ షుబ్లీ ఉర్దూ అకాడమీ చైర్మన్, తమీమ్ అన్సారి IAS , షరీన్ IPS , అల్ హజ్ కె.యం.షకీల్ షఫీ రాష్ట్ర ముతవల్లీల సంఘం అధ్యక్షులు, అల్తాఫ్ బాబా కొండపల్లి దర్గా, హజరత్ నిజాం సాహెబ్ తెనాలి దర్గా, ఉబేదుల్లా హుస్సేని రాష్ట్ర ముతవల్లీల సంఘం కార్యదర్శి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ వి ఎస్ ముక్తియార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

భారతదేశ చరిత్రలోనే వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి, వహాజరయ్యారులు కల్పించేందుకు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. పట్టాలు అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం, భవిష్యత్తుపై నమ్మకం ఈ సదస్సు విజయానికి నిదర్శనం.

ఈ సందర్భంగా ముతవల్లీల సంఘం అధ్యక్షులు షకీల్ షఫీ గారు మాట్లాడుతూ.. మైనారిటీ సమాజ అభివృద్ధిలో విద్య మరియు సాంకేతిక నైపుణ్యాలు ఎంతో కీలకమని, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన ఈ మిషన్ ముస్లిం యువత ఉజ్వల భవిష్యత్తుకు సరికొత్త బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణతో పాటు వాటి ద్వారా సమాజ సేవ, విద్యాభివృద్ధికి ముతవల్లీలందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యులు, రాష్ట్రవ్యాప్తంగా విచ్చేసిన ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీ సభ్యులు మతపెద్దలు, ముస్లిం సోదరులు మరియు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!