ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్తాలీం ఏ హునర్ కు రూ 3 కోట్ల రుసుము

తాలీం ఏ హునర్ కు రూ 3 కోట్ల రుసుము

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (విజయవాడ):

తాలీం ఏ హునర్ కు రూ 3 కోట్ల రుసుము ( ప్రస్తుతము కడుతున్న 5% వక్ఫ్ ఫండ్ కు అదనంగా 5% ఎడ్యుకేషన్స్ సెస్ మొత్తం 10% కట్టడానికి ) రాష్ట్ర ముతవల్లీలు, దర్గా సజ్జదే నషీన్లు మేనేజింగ్ కమిటీలు హామీ ఇచ్చారు.

విజయవాడ నగరంలో జరిగిన తాలీం ఏ హునర్ కార్యక్రమంలో అర్హత సాధించిన విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్ తో పార్టీ కాలేజ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి శ్రీ ఎన్.ఎం.డి ఫరూక్ గారు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ ఎం.ఏ. షరీఫ్ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షూబ్లి గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఇక్బాల్ గారు, ఎమ్మెల్యే శ్రీ నసీర్ గారు, ఎమ్మెల్సీ శ్రీమతి జకియా ఖాన్ గారు, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ గారు, శ్రీ నాగుల్ మీరా గారు, పెనుగొండ దర్గా పిఠాధిపతి తాజ్ బాబా సాహెబ్ గారు, అల్తాఫ్ రజా సాహెబ్ గారు ఉబేదుల్లా హుసేని గారు, తెనాలి దర్గా నిజాముద్దీన్ సాహెబ్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు అనేకమంది ముతవల్లిలు లు హాజరయ్యారు.

రాష్ట్ర ముతవల్లీల తరఫున ఈ సంవత్సరం వక్ఫ్ బోర్డుకు చెల్లించే 5% అదనంగా మరొక 5% అంటే మొత్తం 10% వక్ఫ్ ఫండ్ కట్టడానికి ఒప్పుకున్నారు.

తద్వారా దాదాపు మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ముతవల్లీలు, మేనేజింగ్ డైరెక్టర్లు, దర్గాల తరుపున స్వతహాగా తాలీం ఏ హునర్ కార్యక్రమానికి నిధులు సమకూరుస్తామని తెలియజేశారు. ఈ నిర్ణయం పై త్వరలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారితో, శ్రీ షరీఫ్ గారితో, వక్ఫ్ బోర్డు చైర్మన్ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తాలీం ఏ హునర్ విద్య అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక సహాయము చేయడానికి చట్టపరంగా జీవోను ఇష్యూ చేయాలని కోరనున్నారు. ఎడ్యుకేషన్ సెస్ అనే విధానాన్ని జీవో రూపకంలో తేవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

మైనారిటీలకు అన్ని విధాలుగా తోడ్పడుతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి రాష్ట్ర ముతవల్లిల సంఘం అధ్యక్షులు కె.యం. షకీల్ షఫీ గారు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!