ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్స్వయం పరివర్తనతోనే విశ్వ పరివర్తన

స్వయం పరివర్తనతోనే విశ్వ పరివర్తన

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

బ్రహ్మకుమారీస్ సంస్థ తొలి అధ్యక్షురాలు జగదంబ సరస్వతీ మమ్మా  61వ పుణ్యస్మృతి దినం సందర్భంగా నేటి దినాన్ని నారీ సశక్తీ కరణం దినంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అన్ని ఓం శాంతి సేవా కేంద్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నారని RTPP శాఖ నిర్వాహకురాలు బి కె. సౌజన్య  తెలిపారు, ఈ సందర్భంగా RTPP ఓం శాంతి భవన్ లో  ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రొద్దుటూరు నుంచి విచ్చేసిన BK. శాంత, సౌజన్య తదితర ఓం శాంతి సభ్యులు జగదాంబ చిత్రపటానికి పుష్పాలతో నివాలులు అర్పించి, విశ్వశాంతి కై ఉదయం 9 నుండి 12 గంటలవరకు 3 గంటల పాటు సామూహిక ధ్యానం చేశారు .

 

ఈ సందర్భంగా BK శాంతా గారు మాట్లాడుతూ :-

విశ్వశాంతి స్థాపనకై విశేష కృషిగావించి, జీవితాన్ని అర్పించిన *మహాయోగులలో జగదాంబ సరస్వతి ఒకరు* అని, త్యాగం తపస్సు సేవకు ప్రతీకగా నిలిచిన జగదంబ *స్వయం పరివర్తనతోనే విశ్వ పరివర్తన అన్న నినాదంతో తన 17వ యేటనే* సంస్థ అధ్యక్ష పదవిని చేపట్టి భారతీయ సనాతన గృహస్థ ధర్మానికి చెందిన రాజయోగం గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, సాంప్రదాయ సదాచారాలతో మహిళలను ఆత్మజ్ఞానంతో సశక్తీకరణ గావించారన్నారు.

వీరనారీమణులకు నిలయమైన మన దేశంలో నేటికీ స్త్రీల పట్ల ఉన్న చిన్న చూపును, స్త్రీలపై జరిగే మానసిక,శారీరిక వేధింపులు అత్యాచారాలను తిప్పి కొట్టేందుకు, మానసిక శారీరక దృఢత్వం కోసం మ మ్మగారు బోధించిన రాజయోగ జీవన విధానం ప్రతి మహిళ అవలంబించి శక్తి స్వరూపంగా మారాలన్నారు. స్వయం పరివర్తనతో విశ్వ పరివర్తన అన్న నాందితో స్త్రీలను మహాశక్తులుగా చైతన్య పరచిన మమ్మ జగదంబను ఆదర్శంగా తీసుకొని వారి బోధనలు, అనుకరణలు ఆచరించి ఆత్మసంస్కరణ గావించుకుంటే *వికసిత్ భారత్* సంకల్పం సాకారం అవుతుందన్నారు.

1919లో పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించిన మమ్మా సంస్థ ఆవిర్భావ కాలం నుండి 1936 నుండి 1965 వరకు 29 సంవత్సరాలు అధ్యక్ష బాధ్యత చేపట్టి సంస్థ అభివృద్ధికి కీలక పాత్ర పోషించి, ఆనాటి కాలంలోనే దేశవ్యాప్తంగా 600లకు పైగా సేవా కేంద్రాలను విస్తరింపజేసి, 900 మంది సమర్పిత రాజయోగ శిక్షణా బోధికురాండ్లను, బ్రహ్మకుమారీలను తయారుచేసి, చిన్నతనం నుండే సదాచారం జ్ఞాన యోగ ధారణ సేవలతో కర్మాతీత స్థితిని పొంది 1965 జూన్ 24న తనువు త్య జించి మాతేశ్వరిగా ప్రసిద్ధి చెందారన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!