ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్శ్రీకృష్ణాలయంలో మంత్రి పార్థసారథి కి ఘన స్వాగతం

శ్రీకృష్ణాలయంలో మంత్రి పార్థసారథి కి ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు :

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి శనివారం స్థానిక శ్రీకృష్ణాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు నంద్యాల కొండారెడ్డి స్థానిక శ్రీకృష్ణ ఆలయంలో ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న అతిథులను పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ మర్యాదల ప్రకారం ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణుని ఆశీర్వాదం అందించారు. తదుపరి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నాయకుడు నంద్యాల కొండారెడ్డిని గజమాలలతో సన్మానించారు. అలాగే వారికి శ్రీకృష్ణ స్వామి ప్రతిమను బహుకరించారు.ఈ కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆలయ గౌరవ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, శ్రీకృష్ణ ఆలయ పాలకమండలి అధ్యక్షుడు , సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!