సలాం ప్రొద్దుటూరు:
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులోని స్థానిక కృష్ణాలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గౌరవ అధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో డా. వి.ఎస్. ముక్తియార్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా డా. వి.ఎస్. ముక్తియార్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐకమత్యంతో, సోదరభావంతో ముందుకు సాగాలని కోరుకున్నారు.కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
