ePaper
Friday, September 4, 2026
ePaper
Homebusinessస్వర్ణకారుల విద్యుత్ సబ్సిడీ కోసం కృషి చేసిన ముక్తియార్‌కు కృతజ్ఞతలు

స్వర్ణకారుల విద్యుత్ సబ్సిడీ కోసం కృషి చేసిన ముక్తియార్‌కు కృతజ్ఞతలు

📰 Generate e-Paper Clip

 

సలాం   ప్రొద్దుటూరు:

స్వర్ణకారులకు విద్యుత్ సబ్సిడీ సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్‌ను ఆంధ్రప్రదేశ్ ముస్లిం స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు కలిసి శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. స్వర్ణకారుల వృత్తి అభివృద్ధి, వారి కుటుంబాల ఆర్థిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సబ్సిడీ సౌకర్యం కోసం ముక్తియార్ చేసిన కృషి అభినందనీయమన్నారు.

 

ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ ఖర్చుల నేపథ్యంలో సబ్సిడీ విద్యుత్ అందుబాటులోకి వస్తే స్వర్ణకారులపై ఆర్థిక భారం తగ్గి, వారు తమ వృత్తిని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.స్వర్ణకారుల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేసిన డా. వి.ఎస్. ముక్తియార్‌కు తమ సమాజం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ స్వర్ణకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇదే విధంగా సహకరించాలని ఆకాంక్షించారు.

 

అనంతరం సంఘం ప్రతినిధులు డా. వి.ఎస్. ముక్తియార్‌కు కృతజ్ఞతా పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి జాకీర్ హుస్సేన్, కోశాధికారి ఎం.డి. యాకూబ్, సభ్యులు షేక్ జిలాన్ భాష, పఠాన్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!