శ్రీకృష్ణాలయంలో మంత్రి పార్థసారథి కి ఘన స్వాగతం

సలాం ప్రొద్దుటూరు :   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి శనివారం స్థానిక శ్రీకృష్ణాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు నంద్యాల కొండారెడ్డి స్థానిక శ్రీకృష్ణ ఆలయంలో ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న అతిథులను పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ మర్యాదల ప్రకారం ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణుని ఆశీర్వాదం అందించారు. తదుపరి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నాయకుడు నంద్యాల...