.. రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
సలాం ప్రొద్దుటూరు (విజయవాడ):
రాష్ట్రం లోని ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీలు ఆదివారం ఉదయం 10:30కు విజయవాడలోని రైల్వే స్టేషన్ కు దగ్గర ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రము ఫంక్షన్ హాల్ కు హాజరు కావాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పిలుపుఇచ్చారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తాలిం ఏ హూనర్ 2026 లో ఉత్తీర్ణత సాధించిన పిల్లలు వారి తల్లి తండ్రులతో పాటు ముతవల్లిలతో సమావేశము కావడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్రములోని ముతవల్లీలు మేనేజింగ్ కమిటీలు తప్పక హాజరుకావాలని కోరారు .రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు సభ్యులు ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ముతవల్లిల సంఘం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ముతవలి సంఘం అధ్యక్షులు అల్ హజ్ కె.యం.షకీల్ షఫీ ఈ సందర్భంగా తెలిపారు.
