సలాం ప్రొద్దుటూరు:
చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు , పథకాలు అమలులో అలాగే గత ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు కొనసాగించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనీ రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని శేగిరెడ్డి కల్యాణమండపంలో సోమవారం కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఫోటో ఎగ్గిబిషన్ , LED స్క్రీన్ల ద్వారా చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నాయకులకు ,మహిళలకు, కార్యకర్తలకు వివరించారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్,నారాలోకేష్ ఫోటోలతో ఏర్పాటు చేసిన
ఇచ్చిన హామీల గురించి వినం,చూడం,మాట్లాడం పోస్టర్ కు కార్యకర్తల నుండి విశేష స్పందన లభించింది. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమిపాలన కు రెండేళ్లు పూర్తి అయింది అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యలు ఎండ కడుతూ ఈనెల 12వ తేదీన వేలాది మందితో గొప్ప ర్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినా హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చకపోగా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వైయస్సార్ నాయకుల పై కేసులు పెట్టి జైలుకు పంపే ఆలోచనల లో ఉన్నారన్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు కప్పిపుచ్చుకునేందుకు ఈనెల 9 తేదీన తిరుపతి లోక బహిరంగ సభ,12 వ తేదీన విశాఖపట్నంలో ఒక సభ ,15 న విజయవాడలో మరొక సభ ఏర్పాటు చేస్తున్నారనీ రాచమల్లు అన్నారు. ఈ మూడు బహిరంగ సభల ద్వారా చంద్రబాబు రెండేళ్ల కూటమి పాలనలో జరిగిన ఘనమైన విజయాలను ప్రజలకు చెప్పేందుకు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు తాము రెండేళ్లలో ఇది చేశానని వైఎస్ఆర్సిపి నాయకులు అభివృద్ధి జరగలేదని మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదని చెబుతున్నామని అయితే ప్రజలు ఇద్దరు పార్టీల మాటలు పక్కనపెట్టి స్వతహాగా ఆలోచించి రెండేళ్ల కాలంలో అభివృద్ధి ఏం జరిగిందో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చరా లేదా అని ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల తరపున ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు జరిగే మూడు బహిరంగ సభలో పాల్గొనే కూటమి నాయకులకు ప్రశ్నిస్తున్న అన్నారు. ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 , 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ ,మహిళలకు సామాజిక పెన్షన్ 4000 ఇచ్చారా? రెండేళ్లయింది ఒక కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? రైతులకు 26 వేల రూపాయలు ఇస్తారన్నారు ఇచ్చారా? నిరుద్యోగ భృతికి 3 వేలు ఇస్తారన్నారు ఒకరికైనా ఇచ్చారా? అని ఘాటుగా ప్రశ్నించారు. 75 సంవత్సరాలు వయస్సు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక నిరుద్యోగిని కైనా కూర్చోబెట్టుకుని తనకు నిరుద్యోగ భృతి అందిందో లేదో అడిగి తెలుసుకోవాలన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారనీ వాగ్దానం చేశారు రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. డీఎస్సీ టీచర్ ఉద్యోగాలు 20 లక్షలు అమ్ముకున్నారనీ ఆరోపించారు. జగనన్న ఇచ్చిన పథకాలు అమలు చేస్తారని మాట ఇచ్చారని అయితే ఒక్క పథకమైన అమలు చేశారా అని ప్రశ్నించారు. నాడు నేడు ద్వారా బడులకు మౌలిక వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమం పూర్తి చేశారా? ఫీజు రియంబర్స్మెంట్ పథకం 4వేల కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థుల చదువు ప్రశ్నార్థకం చేశారన్నారు. అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ అని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారని వైయస్ జగన్ 20 లక్షల కార్డు లు జారీ చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ లో పేదవారికి వైద్యం అందడం లేదని డబ్బుంటే హాస్పిటల్స్ రావాలని లేకుంటే వెళ్లిపోవాలని హాస్పిటల్స్ నిర్వాహకులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు. డబ్బున్నవారు అప్పు చేసుకొని బ్రతుకుతున్నారని డబ్బు లేని వారు చనిపోతున్నారని ఆయన వాపోయారు. రెండేళ్లకు ఆరు గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉంది ఒక సిలిండర్ అయిన ఎవరికైనా ఇచ్చారా ?100 మందిలో 50 మంది 6 గ్యాస్ సిలిండర్ అందాయని చెబితే ఈ ప్రభుత్వం సక్సెస్ అయినట్టే అని ఆయన చెప్పారు. 52 లక్షల మంది అమ్మ ఒడి ఇచ్చి 30 లక్షల మందికి ఇవ్వలేదని అలాగే గతంలో15000 వేలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు13000 వేలు, మరి కొందరికి అయితే 8000 వేల నుంచి 10000 వరకే అకౌంట్లో వేశారని ఆయన ఆరోపించారు. కరెంట్ బిల్లులు పెంచనని చెప్పి మూడు నెలలకే పెంచి 24 వేల కోట్లు ప్రజలపై భారం వేశారన్నారు. బిల్ కట్టాలంటే కరెంట్ షాక్ కొడుతుంది అన్నారు. ఆరుసార్లు గ్యాస్ డీజిల్ పెట్రోలు పెంచారన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సామాన్యుడు బువ్వ తినే పరిస్థితిలో లేరన్నారు.
