సలాం ప్రొద్దుటూరు:
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రొద్దుటూరులో జరిగిన ఓ చోరీ కేసుకు సంబంధించి తమిళనాడు రాష్ట్రానికి చెందిన శివకుమార్ మునియప్పన్ అనే నిందితున్ని 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పి విభూకృష్ణ సోమవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 55 గ్రాముల బంగారుతో ఆల్లిన రుద్రాక్ష మాల, 28 గ్రాముల బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు, వెండి ఉంగరాలు, ఒక హెచ్ పి లాప్టాప్, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సిఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
