ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeఎడిటోరియల్చేనేత కుటుంబాలకు హర్ష హెల్త్ కార్డులు పంపిణీ

చేనేత కుటుంబాలకు హర్ష హెల్త్ కార్డులు పంపిణీ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరులోని చేనేత కుటుంబాలకు హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.చేనేత, పవర్ లూమ్స్ కార్మికులు, చేనేతతో అనుబంధంగా జీవనోపాధి పొందుతున్న కుటుంబాలకు 50 శాతం రాయితీతో వైద్య సేవలను అందించనున్నట్లు హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుడు, ఏపీ పద్మశాలీయ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ కల్వ విజయనాగేంద్ర, డాక్టర్ సమిత తెలిపారు. ఇందులో భాగంగా హర్ష హెల్త్ కార్డు పథకాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయనాగేంద్ర మాట్లాడుతూ ఈ పథకం ద్వారా కుల, మతాలకు అతీతంగా చేనేత కార్మికులు, పవర్ లూమ్స్ కార్మికులతో పాటు రాట్నం వడికేవారు, అద్దకం పని చేసే కార్మికులు, నూలు తీసేవారు తదితర అనుబంధ వృత్తుల వారికి, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. హెల్త్ కార్డు కలిగిన వారికి తమ ఆస్పత్రిలో పలు వైద్య సేవలపై 50 శాతం వరకు ప్రత్యేక రాయితీ లభిస్తుందన్నారు. డాక్టర్ కన్సల్టేషన్, డయాగ్నస్టిక్ పరీక్షలు, మందులు, ఇన్పేషెంట్ సేవలకు రాయితీ వర్తిస్తుందని తెలిపారు. కార్మికులకు హెల్త్ కార్డు జీవితకాలం చెల్లుబాటు అవుతుందన్నారు. అనంతరం కార్మికులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధప్రదేశ్ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు, కల్వ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!