ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeఎడిటోరియల్అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (పుట్టపర్తి):

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కదిరి మరియు ధర్మవరం రెవెన్యూ డివిజన్లలో ఖాళీగా ఉన్న 230 అంగన్‌వాడీ సహాయకురాలు (ఆయా) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి కె. ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు.

కదిరి, నల్లచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, సి.కె.పల్లి ఐ.సి.డి.యస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 09-06-2026 నుండి 18-06-2026 సాయంత్రం 5:00 గంటల వరకు సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తులు పొంది, అక్కడే సమర్పించి రశీదు పొందవలెను. గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులు స్వీకరించబడవు. పూర్తి వివరాల కోసం సంబంధిత సి.డి.పి.ఓ (CDPO) కార్యాలయాలను సంప్రదించాలని కోరారు.ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు

కదిరి: 70

నల్లచెరువు: 51

ధర్మవరం: 21

బత్తలపల్లి: 63

సి.కె.పల్లి: 25

మొత్తం ఖాళీలు: 230

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!